హాస్టళ్లలో నీళ్లు రాక.. రోడ్డెక్కిన విద్యార్థినులు 

Date:

ఉస్మానియా యూనివర్శిటీలో నీటి కొరత సమస్య ఏర్పడింది. ఓయూలోని హాస్టళ్లలో నీళ్లు రాక.. విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని వార్డెన్లకు చెప్పినా, ఇంకెవ్వరికి చెప్పినా పట్టించుకోవటం లేదని.. అమ్మాయిలంతా రోడ్డెక్కారు.

అమ్మాయిలన్నప్పుడు ఎన్నో సమస్యలుంటాయని.. కనీస అవసరాలకు కూడా నీళ్లు ఉండట్లేదని అమ్మాయిలు ఆగ్రహంతో ఊగిపోయారు. కనీస అవసరాలకే కాదు.. కనీసం తాగడానికి కూడా నీళ్లు లేవని.. ఈ విషయాన్ని ఎవరికి చెప్పినా.. ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకుండా గాలికి వదిలేశారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సుమారు వెయ్యి మంది ఉన్న హాస్టల్‌కు ఒక్క ట్యాంకర్ పంపించారని.. ఆ నీళ్లతో పూజ చేసుకోవాలా అంటూ ప్రశ్నించారు. ఒక్క ట్యాంకర్ నీళ్లు ఎంత మందికి సరిపెడతారంటూ నిలదీశారు.

అమ్మాయిలు రోడ్డు మీదికొచ్చి ఆందోళన చేస్తుండటంతో.. దిగొచ్చిన ఓయూ సిబ్బంది బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఎలాంటి సమస్య రాకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. కేవలం ఓయూలోనే కాదు.. నగరమంతా ఇలాంటి సమస్యే ఉందని.. ఇంకొన్ని ట్యాంకర్లు తెప్పిస్తామంటూ మాట ఇవ్వటంతో.. అమ్మాయిలు ఆందోళన విరమించారు.

Share post:

Popular

More like this
Related

షుగర్ సమస్య మహిళల కంటే పురుషుల్లోనే ఎక్కువ

షుగర్ సమస్యతో బాధ పడుతున్న మహిళలతో పోలిస్తే పురుషులు ఇతర అనారోగ్య...

ఐఐటీ చదివే విద్యార్థులకు స్కాలర్‌షిప్‌

ఐఐటీల్లో చదవాలని చాలా మంది విద్యార్థులు కలలుగంటారు. సీటు వచ్చిన వారికి...

అప్పు కట్టలేదని రైతు భార్యపిల్లలను తీసుకెళ్లిన మహిళ

వ్యవసాయం కోసం ఒక రైతు ఓ మహిళ వద్ద అప్పు చేశాడు....

మూడు సెకన్లలోనే కాటేసిన మృత్యువు

మనిషి మరణం ఎప్పుడు, ఏలా వస్తుందో తెలియదు. కన్నుమూసి తెరిచేలోపే మనిషి...