రాష్ట్రం కోసం పనిచేసేది బిఆర్ఎస్ మాత్రమే

Date:

అధికారంలో లేకపోయినా తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసేది బిఆర్ఎస్ మాత్రమేనని, తెలంగాణ ప్రజల ఆశలన్నీ బిఆర్ఎస్ ఎంపీలపైనే ఉన్నాయని ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ అన్నారు. త్వరలో జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవల్లిలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు, లోక్‌సభాపక్షనేత నామా నాగేశ్వరరావుతో పాటు ఎంపీలు, కేటీఆర్, హరీశ్‌రావు కూడా సమావేశంలో పాల్గొన్నారు.

కేసీఆర్‌ మాట్లాడుతూ పార్లమెంట్‌లో బిఆర్ఎస్ గళం బలంగా వినిపించాలి. రాష్ట్ర హక్కులు, ప్రయోజనాల కోసం పోరాడాలి. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన వాటి గురించి ప్రశ్నించాలి. కృష్ణాబోర్డుకు ప్రాజెక్టులు అప్పగిస్తే తెలంగాణకు నష్టం. ఆపరేషన్‌ మ్యానువల్‌, ప్రొటోకాల్‌ లేకుండా ప్రాజెక్టులు ఎలా తీసుకుంటారు. బిఆర్ఎస్ క్షేత్రస్థాయిలో బలంగా ఉంది. ఎవరితో సంబంధం లేకుండా గట్టిగా పోరాడుదాం. త్వరలోనే నేను ప్రజల్లోకి వస్తా” అని తెలిపారు. ఉభయసభల్లో పార్టీ తరఫున అనుసరించాల్సిన వైఖరి, వ్యూహాలపై ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.

Share post:

Popular

More like this
Related

షుగర్ సమస్య మహిళల కంటే పురుషుల్లోనే ఎక్కువ

షుగర్ సమస్యతో బాధ పడుతున్న మహిళలతో పోలిస్తే పురుషులు ఇతర అనారోగ్య...

ఐఐటీ చదివే విద్యార్థులకు స్కాలర్‌షిప్‌

ఐఐటీల్లో చదవాలని చాలా మంది విద్యార్థులు కలలుగంటారు. సీటు వచ్చిన వారికి...

అప్పు కట్టలేదని రైతు భార్యపిల్లలను తీసుకెళ్లిన మహిళ

వ్యవసాయం కోసం ఒక రైతు ఓ మహిళ వద్ద అప్పు చేశాడు....

మూడు సెకన్లలోనే కాటేసిన మృత్యువు

మనిషి మరణం ఎప్పుడు, ఏలా వస్తుందో తెలియదు. కన్నుమూసి తెరిచేలోపే మనిషి...