ప్రజలు భారాసకు మద్దతుగా నిలిచారు

Date:

బిఆర్ఎస్ పార్టీకి లోక్‌సభ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంత ప్రజలు మద్దతుగా నిలిచారని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. రైతు భరోసా వేయనందుకు రైతులు కాంగ్రెస్‌పై ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. సిరిసిల్లలో కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు. ”అనేక హామీలు ఇచ్చి ప్రజలను కాంగ్రెస్‌ ప్రభుత్వం మోసం చేసింది. నెలకు రూ. 2500 ఇవ్వలేదని కాంగ్రెస్‌పై మహిళలు కోపంతో ఉన్నారు.

బిజెపిపై కూడా ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది. పెట్రోల్‌, నిత్యావసరాల ధరలు పెంచారని మోదీపై కోపంతో ఉన్నారు. రెండు జాతీయ పార్టీలకు భారాస ముచ్చెమటలు పట్టించింది. మూడు పార్టీల్లో మా పార్టీకే అధిక ఎంపీ సీట్లు వస్తాయి. దిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ అన్నట్లుగా భాజపా-కాంగ్రెస్‌ వైఖరి ఉంది. ఆరేడు సీట్లలో డమ్మీ అభ్యర్థులను పెట్టి భాజపాకు సహకరించారు. కేంద్రంలోనూ ఏ కూటమికి స్పష్టమైన ఆధిక్యం వచ్చే పరిస్థితి లేదు. ప్రాంతీయ పార్టీలతో ఏర్పడే కూటమిదే కేంద్రంలో అధికారం’ అని కేటీఆర్‌ అన్నారు

Share post:

Popular

More like this
Related

షుగర్ సమస్య మహిళల కంటే పురుషుల్లోనే ఎక్కువ

షుగర్ సమస్యతో బాధ పడుతున్న మహిళలతో పోలిస్తే పురుషులు ఇతర అనారోగ్య...

ఐఐటీ చదివే విద్యార్థులకు స్కాలర్‌షిప్‌

ఐఐటీల్లో చదవాలని చాలా మంది విద్యార్థులు కలలుగంటారు. సీటు వచ్చిన వారికి...

అప్పు కట్టలేదని రైతు భార్యపిల్లలను తీసుకెళ్లిన మహిళ

వ్యవసాయం కోసం ఒక రైతు ఓ మహిళ వద్ద అప్పు చేశాడు....

మూడు సెకన్లలోనే కాటేసిన మృత్యువు

మనిషి మరణం ఎప్పుడు, ఏలా వస్తుందో తెలియదు. కన్నుమూసి తెరిచేలోపే మనిషి...