తెలుగు రాష్ట్రాల్లో మరో నాలుగు రోజులు వడగాలులు

Date:

సూర్య భగవానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. భానుడి ప్రతాపంతో ఎండలు భగ్గుమంటుంటే గత రెండు రోజులుగా వడగాలులు జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పగలు 10 గంటలు దాటితే బయటకు రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. సాయంత్రం 6 గంటల తర్వాత కూడా వేడిగాలి సెగలు రేపుతోంది. పిల్లలు, వృద్ధులూ వడగాడ్పులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

మరో నాలుగు రోజుల పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లో వడగాల్పుల ప్రభావం కొనసాగుతుందని ఐఎండీ హెచ్చరించింది. ఇక తూర్పు ప్రాంతంలో వడగాలులు మరో మూడు రోజుల పాటు కొనసాగుతాయని ఐఎండీ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ నరేష్ కుమార్ హెచ్చరించారు.

ఒడిషా, పశ్చిమ బెంగాల్‌, బిహార్ రాష్ట్రాల్లో తీవ్ర వడగాలులు కొనసాగుతాయని స్పష్టం చేశారు. మూడు రోజుల తర్వాత ఉరుముల కారణంగా వేడి గాలుల తీవ్రత తగ్గుతుందని అన్నారు. ఇక అరుణాచల్ ప్రదేశ్‌, అసోం, మేఘాలయ, నాగాలాండ్‌, మిజోరాంలో రెండు రోజుల తర్వాత భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు.

Share post:

Popular

More like this
Related

షుగర్ సమస్య మహిళల కంటే పురుషుల్లోనే ఎక్కువ

షుగర్ సమస్యతో బాధ పడుతున్న మహిళలతో పోలిస్తే పురుషులు ఇతర అనారోగ్య...

ఐఐటీ చదివే విద్యార్థులకు స్కాలర్‌షిప్‌

ఐఐటీల్లో చదవాలని చాలా మంది విద్యార్థులు కలలుగంటారు. సీటు వచ్చిన వారికి...

అప్పు కట్టలేదని రైతు భార్యపిల్లలను తీసుకెళ్లిన మహిళ

వ్యవసాయం కోసం ఒక రైతు ఓ మహిళ వద్ద అప్పు చేశాడు....

మూడు సెకన్లలోనే కాటేసిన మృత్యువు

మనిషి మరణం ఎప్పుడు, ఏలా వస్తుందో తెలియదు. కన్నుమూసి తెరిచేలోపే మనిషి...