తెలంగాణలో రైతు భరోసా నిధులపై ఈసీ ఆంక్షలు

Date:

తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా నిధుల విడుదలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ తర్వాతే నిధులను విడుదల చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. రైతు భరోసా చెల్లింపుల విషయంలో సీఎం రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలపై ఎన్‌.వేణు కుమార్‌ ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఈసీ.. సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల నియమావళి ఉల్లంఘించారని పేర్కొంది.

ఐదు ఎకరాలు పైబడి వ్యవసాయ భూమి ఉన్న వారికి రైతు భరోసా నిధులను సోమవారం విడుదల చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రైతుల ఖాతాల్లో నగదును జమ చేసే ప్రక్రియ చేపట్టింది. దాదాపు రూ.2వేల కోట్లకు పైగా నిధులు విడుదల చేసినట్టు సమాచారం. మూడు రోజుల్లో చెల్లింపుల ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు భావించారు. తాజాగా ఈసీ ఆదేశాల నేపథ్యంలో రైతుల ఖాతాల్లో నగదు జమ చేసే ప్రక్రియకు బ్రేక్‌ పడింది.

Share post:

Popular

More like this
Related

షుగర్ సమస్య మహిళల కంటే పురుషుల్లోనే ఎక్కువ

షుగర్ సమస్యతో బాధ పడుతున్న మహిళలతో పోలిస్తే పురుషులు ఇతర అనారోగ్య...

ఐఐటీ చదివే విద్యార్థులకు స్కాలర్‌షిప్‌

ఐఐటీల్లో చదవాలని చాలా మంది విద్యార్థులు కలలుగంటారు. సీటు వచ్చిన వారికి...

అప్పు కట్టలేదని రైతు భార్యపిల్లలను తీసుకెళ్లిన మహిళ

వ్యవసాయం కోసం ఒక రైతు ఓ మహిళ వద్ద అప్పు చేశాడు....

మూడు సెకన్లలోనే కాటేసిన మృత్యువు

మనిషి మరణం ఎప్పుడు, ఏలా వస్తుందో తెలియదు. కన్నుమూసి తెరిచేలోపే మనిషి...