ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి హీరో వెంకటేష్‌కు స్వయానా వియ్యంకుడు

Date:

హైదరాబాద్‌ లోక్‌సభ స్థానానికి మహమ్మద్‌ సమీర్, కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థిగా రాజేందర్‌రావుతో పాటు ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా రామసహాయం రఘురాంరెడ్డిల పేర్లను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఖమ్మం అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి సినీ హీరో వెంకటేష్‌కు స్వయానా వియ్యంకుడు.

తెలంగాణలో మే 13న లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. తాజాగా ఖమ్మం పార్లమెంట్ కి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రామసహాయం రఘురాంరెడ్డి నామినేషన్ వేశారు. ఇక రఘురాంరెడ్డి రాజకీయాలకు కొత్తేమీ కాదు. ఆయన సీనియర్ కాంగ్రెస్ నాయకులు రామసహాయం సురేందర్ రెడ్డి కుమారుడు. ఖమ్మం జిల్లాకు చెందిన సురేందర్ రెడ్డి.. కాంగ్రెస్ తరపున పలుసార్లు ఎంపీగా, ఎమ్మెల్యేగా గెలుపొందారు. వయసు రీత్యా సురేందర్ రెడ్డి రాజకీయాలకు దూరంగా ఉంటుండగా.. ఇప్పుడు ఆయన కుమారుడు రఘురాంరెడ్డి రంగంలోకి దిగారు.

రఘురాంరెడ్డికి సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖ కుటుంబాలతో బంధుత్వం ఉంది. హీరో వెంకటేష్ కుమార్తె అశ్రితను ఆయన పెద్ద కుమారుడు వినాయక్ రెడ్డి పెళ్లి చేసుకోగా.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమార్తె స్వప్నిరెడ్డిని ఆయన చిన్నకుమారుడు అర్జున్ రెడ్డి వివాహం చేసుకున్నారు. అలా ఇటు వెంకటేష్ కి, అటు పొంగులేటికి రఘురాంరెడ్డి వియ్యంకుడు. కాబట్టి వెంకటేష్ ప్రచారానికి వచ్చే అవకాసం ఉందని అంటున్నారు.

Share post:

Popular

More like this
Related

షుగర్ సమస్య మహిళల కంటే పురుషుల్లోనే ఎక్కువ

షుగర్ సమస్యతో బాధ పడుతున్న మహిళలతో పోలిస్తే పురుషులు ఇతర అనారోగ్య...

ఐఐటీ చదివే విద్యార్థులకు స్కాలర్‌షిప్‌

ఐఐటీల్లో చదవాలని చాలా మంది విద్యార్థులు కలలుగంటారు. సీటు వచ్చిన వారికి...

అప్పు కట్టలేదని రైతు భార్యపిల్లలను తీసుకెళ్లిన మహిళ

వ్యవసాయం కోసం ఒక రైతు ఓ మహిళ వద్ద అప్పు చేశాడు....

మూడు సెకన్లలోనే కాటేసిన మృత్యువు

మనిషి మరణం ఎప్పుడు, ఏలా వస్తుందో తెలియదు. కన్నుమూసి తెరిచేలోపే మనిషి...