అవినీతి నిర్మూలనపై అవగాహన కల్పించండి

Date:

నేటి యువతకు అవినీతి నిర్మూలనపై అవగాహన కల్పించాలని భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజ్ అన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో యూత్ ఫర్ యాంటీ కరప్షన్ క్యాలెండర్ ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. సమస్యలపై ప్రశ్నించే చట్టాలపై యువతకు, ప్రజలకు, మహిళలకు అవగాహన కల్పిస్తే, వారి సమస్యలను వారే ప్రశ్నించి దానికి పరిష్కారం మార్గం కనుగొంటారని ఆయన అన్నారు. అవినీతి రహిత సమాజం కోసం యువతరాన్ని ఏకం చేసే దిశగా యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ముందుకు నడవాలని వారు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో యువతకు అవగాహన సదస్సులు నిర్వహించినప్పుడు తనకు సమాచారం ఇవ్వాలని, సమయాన్ని బట్టి తాను హజరవుతానని ఎస్పీ తెలిపారు. మంచి సమాజం కోసం యువతను భాగస్వామ్యులను చేయాలని అన్నారు. ఈ క్యాలెండర్ ఆవిష్కరణలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంచార్జ్ ప్రవీణ్ కుమార్, కార్యదర్శులు వెంకటచారి, ముత్తు రావుల, చంటి, నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.

Share post:

Popular

More like this
Related

షుగర్ సమస్య మహిళల కంటే పురుషుల్లోనే ఎక్కువ

షుగర్ సమస్యతో బాధ పడుతున్న మహిళలతో పోలిస్తే పురుషులు ఇతర అనారోగ్య...

ఐఐటీ చదివే విద్యార్థులకు స్కాలర్‌షిప్‌

ఐఐటీల్లో చదవాలని చాలా మంది విద్యార్థులు కలలుగంటారు. సీటు వచ్చిన వారికి...

అప్పు కట్టలేదని రైతు భార్యపిల్లలను తీసుకెళ్లిన మహిళ

వ్యవసాయం కోసం ఒక రైతు ఓ మహిళ వద్ద అప్పు చేశాడు....

మూడు సెకన్లలోనే కాటేసిన మృత్యువు

మనిషి మరణం ఎప్పుడు, ఏలా వస్తుందో తెలియదు. కన్నుమూసి తెరిచేలోపే మనిషి...