అమెరికాలో తీవ్రమైన మంచు తుపాను

Date:

అగ్రరాజ్యం అమెరికాలో చాలా చోట్ల భారీగా హిమపాతం నమోదైంది. కొన్ని పట్టణాల్లో మంచు తుపాన్ కారణంగా ప్రయాణాలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. పాఠశాలలు మూతపడ్డాయి. న్యూయార్క్‌, మస్సాచుసెట్స్‌, పెన్సిల్వేనియా ప్రాంతాల్లో కేవలం ఆన్‌లైన్‌ క్లాస్‌లు మాత్రమే నిర్వహిస్తున్నారు. గత రెండేళ్లలో ఇలాంటి మంచు తుపాన్‌ను చూడలేదని స్థానికులు చెబుతున్నారు. ఈ తుపాను కారణంగా పెన్సిల్వేనియాలో ఒక స్నోమొబైలర్‌ ప్రాణాలు కోల్పోయాడు. ఈ రాష్ట్రంలో 1,50,000 కుటుంబాలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.

పెన్సిల్వేనియా నుంచి మస్సాచుసెట్స్‌ వరకు ఉన్న పట్టణాల్లో మంగళవారం ఉదయం నుంచే మంచు భారీగా పడటం మొదలైంది. దాదాపు ఐదు కోట్ల మంది ఇబ్బంది పడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. కనెక్టికట్‌లోని ఫర్మింగ్టన్‌ పట్టణంలో దాదాపు 15.5 అంగుళాల మేర మంచు కురిసింది. ఈశాన్య అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో భారీ వాహనాలు రోడ్లపై ప్రయాణించడాన్ని నిషేధించారు. న్యూయార్క్‌, బోస్టన్‌లలో దాదాపు 1,200 విమానాలు రద్దయ్యాయి. మరో 2,700 విమాన సర్వీసుల్లో జాప్యం ఏర్పడింది. న్యూయార్క్‌ నగరంలో 744 రోజుల తర్వాత మంచుపడింది. ఇక్కడ 2.5 అంగుళాల మేర హిమపాతం నమోదైంది.

Share post:

Popular

More like this
Related

షుగర్ సమస్య మహిళల కంటే పురుషుల్లోనే ఎక్కువ

షుగర్ సమస్యతో బాధ పడుతున్న మహిళలతో పోలిస్తే పురుషులు ఇతర అనారోగ్య...

ఐఐటీ చదివే విద్యార్థులకు స్కాలర్‌షిప్‌

ఐఐటీల్లో చదవాలని చాలా మంది విద్యార్థులు కలలుగంటారు. సీటు వచ్చిన వారికి...

అప్పు కట్టలేదని రైతు భార్యపిల్లలను తీసుకెళ్లిన మహిళ

వ్యవసాయం కోసం ఒక రైతు ఓ మహిళ వద్ద అప్పు చేశాడు....

మూడు సెకన్లలోనే కాటేసిన మృత్యువు

మనిషి మరణం ఎప్పుడు, ఏలా వస్తుందో తెలియదు. కన్నుమూసి తెరిచేలోపే మనిషి...