అద్దె గర్భం ద్వారా 22 మంది పిల్లలకు తల్లి

Date:

చాలా మంది మహిళలు పిల్లలు కావాలని  తహతహలాడుతారు. కానీ టర్కీకి చెందిన ఓ ధనవంతుడి భార్య క్రిస్టినా ఓజ్‌టుర్క్ వయస్సు కేవలం 26 ఏళ్లు.. కానీ ఆమె ఇప్పటికే అద్దె గర్భం ద్వారా 22 మంది పిల్లలకు తల్లి అయ్యింది. రష్యాలో జన్మించిన బ్లాగర్ మార్చి 2020, జూలై 2021 మధ్య తన మిలియనీర్ వ్యాపారవేత్త భర్త గాలిప్ సర్రోగేట్ ద్వారా పిల్లలను కంటూ ఈ ప్రపంచానికి పరిచయం చేసింది. అయితే, క్రిస్టినా తనకు మరింత మంది పిల్లలు కావాలని ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది.

ఆమె పెద్ద బిడ్డ, విక్టోరియా అనే ఎనిమిదేళ్ల కుమార్తె గతంలో ఉన్న భాగస్వామితో సహజంగా జన్మించింది. ఇక, క్రిస్టినాకు చిన్న పిల్లలతో కూడిన పెద్ద కుటుంబం ఉంది. క్రిస్టినా గతంలో తాను మూడు అంకెలను చేరుకోవాలని కోరుకుంటున్నట్లు వెల్లడించింది. గతేడాది ఫిబ్రవరిలో క్రిస్టినా సరోగసీలకు రూ.1 కోటి 43 లక్షలు చెల్లించింది. క్రిస్టినా బేబీస్ డైరీ అనే పుస్తకాన్ని కూడా విడుదల చేసింది. అందులో పిల్లలను పెంచడం గురించి ప్రతిదీ ఇప్పటికే వ్రాయబడింది. అయితే, ప్రతి రోజు ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు ఉత్తమమైన వాటిని మాత్రమే అందించడానికి ఉపయోగకరమైన సమాచారం కోసం చూస్తున్నారని ఆమె చెప్పింది.

Share post:

Popular

More like this
Related

షుగర్ సమస్య మహిళల కంటే పురుషుల్లోనే ఎక్కువ

షుగర్ సమస్యతో బాధ పడుతున్న మహిళలతో పోలిస్తే పురుషులు ఇతర అనారోగ్య...

ఐఐటీ చదివే విద్యార్థులకు స్కాలర్‌షిప్‌

ఐఐటీల్లో చదవాలని చాలా మంది విద్యార్థులు కలలుగంటారు. సీటు వచ్చిన వారికి...

అప్పు కట్టలేదని రైతు భార్యపిల్లలను తీసుకెళ్లిన మహిళ

వ్యవసాయం కోసం ఒక రైతు ఓ మహిళ వద్ద అప్పు చేశాడు....

మూడు సెకన్లలోనే కాటేసిన మృత్యువు

మనిషి మరణం ఎప్పుడు, ఏలా వస్తుందో తెలియదు. కన్నుమూసి తెరిచేలోపే మనిషి...