వివాహమై మూడు నెలలకే యువజంట మృతి

Date:

వివాహమై మూడు నెలలు కూడా కాకముందే యువ దంపతులు మృత్యువాతపడ్డారు. సరదాగా విహారానికి వెళ్లిన ఓ యువజంటను మృత్యువు బలితీసుకుంది. భర్త ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందడంతో అతని మరణాన్ని జీర్ణించుకోలేని భార్య ఆయన లేని జీవితాన్ని ఊహించుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది. వివాహమై మూడు నెలలు కూడా కాకముందే యువ దంపతులు మృత్యువాత పడడంతో వారి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం… ఢిల్లీలోని ఘాజియాబాద్‌కు చెందిన అభిషేక్‌ అహ్లూవాలి(25)కి నవంబర్‌ 30న అంజలి అనే యువతితో వివాహమైంది. అప్పటినుంచి వారు వైశాలిలోని అహ్ల్కాన్ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు. వారిరువురూ సోమవారం దిల్లీ జంతు ప్రదర్శనశాలకు వెళ్లారు. అక్కడ అభిషేక్‌కు ఛాతీలో నొప్పి రావడంతో స్నేహితులకు సమాచారం ఇవ్వగా వారు అతడిని గురుతేజ్‌ బహదూర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం పరిస్థితి విషమించడంతో సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందాడు. మృతదేహాన్ని వారి ఇంటికి తీసుకురాగా భర్త మృతదేహాన్ని చూసి తట్టుకోలేకపోయిన భార్య ఏడో అంతస్థులోని బాల్కనీ నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. తీవ్ర గాయాలపాలైన ఆమెను వైశాలిలోని మ్యాక్స్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచింది. నవ దంపతులిద్దరూ ఇలా అర్ధంతరంగా ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి.

Share post:

Popular

More like this
Related

షుగర్ సమస్య మహిళల కంటే పురుషుల్లోనే ఎక్కువ

షుగర్ సమస్యతో బాధ పడుతున్న మహిళలతో పోలిస్తే పురుషులు ఇతర అనారోగ్య...

ఐఐటీ చదివే విద్యార్థులకు స్కాలర్‌షిప్‌

ఐఐటీల్లో చదవాలని చాలా మంది విద్యార్థులు కలలుగంటారు. సీటు వచ్చిన వారికి...

అప్పు కట్టలేదని రైతు భార్యపిల్లలను తీసుకెళ్లిన మహిళ

వ్యవసాయం కోసం ఒక రైతు ఓ మహిళ వద్ద అప్పు చేశాడు....

మూడు సెకన్లలోనే కాటేసిన మృత్యువు

మనిషి మరణం ఎప్పుడు, ఏలా వస్తుందో తెలియదు. కన్నుమూసి తెరిచేలోపే మనిషి...