మాన‌సిక‌, శారీర‌కంగా హింసించిన‌ టీచర్లు

Date:

స్కూల్ టీచ‌ర్లు మాన‌సిక‌, శారీర‌కంగా హింసించడంతో కేర‌ళ‌లో ఏడ‌వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న 13 ఏళ్ల విద్యార్థి వారం క్రితం ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఆ కేసులో హోలీ ప్యామిలీ విజిటేస‌న్ ప‌బ్లిక్ స్కూల్‌కు చెందిన ఇద్ద‌రు టీచ‌ర్ల‌ను బుక్ చేశారు. ఫిబ్ర‌వ‌రి 15వ తేదీన బాధితుడు ప్ర‌జిత్ మ‌నోజ్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఆ రోజున స్కూల్ నుంచి ఇంటికి వ‌చ్చిన త‌ర్వాత అత‌ను బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డాడు.

ఈ కేసులో ఆ స్కూల్ పీఈటీతో పాటు మ‌రో లేడీ టీచ‌ర్‌పై కేసు బుక్ చేశారు. ఐపీసీలోని సెక్ష‌న్ 324, 75, జువెనైల్ జ‌స్టిస్ యాక్టు ప్ర‌కారం కేసు న‌మోదు చేశారు. ఆ రోజున పీఈటీ టీచ‌ర్ పిల్ల‌వాడిని కొట్టిన‌ట్లు తండ్రి పోలీసు ఫిర్యాదులో ఆరోపించాడు. మ‌రో టీచ‌ర్ ఆ విద్యార్థిపై దుర్భాష‌లాడారు. ప్ర‌జిత్, అత‌ని ఫ్రెండ్ నీళ్లు తాగేందుకు బ‌య‌ట‌కు వెళ్లి మ‌ళ్లీ క్లాస్‌రూమ్‌కు వ‌చ్చారు. అయితే ఆ స‌మ‌యంలో ప్ర‌జిత్‌ను ఓ టీచ‌ర్ తీవ్రంగా కొట్టారు. మ‌రో టీచ‌ర్ ఆ విద్యార్థిని తిట్టారు.

Share post:

Popular

More like this
Related

షుగర్ సమస్య మహిళల కంటే పురుషుల్లోనే ఎక్కువ

షుగర్ సమస్యతో బాధ పడుతున్న మహిళలతో పోలిస్తే పురుషులు ఇతర అనారోగ్య...

ఐఐటీ చదివే విద్యార్థులకు స్కాలర్‌షిప్‌

ఐఐటీల్లో చదవాలని చాలా మంది విద్యార్థులు కలలుగంటారు. సీటు వచ్చిన వారికి...

అప్పు కట్టలేదని రైతు భార్యపిల్లలను తీసుకెళ్లిన మహిళ

వ్యవసాయం కోసం ఒక రైతు ఓ మహిళ వద్ద అప్పు చేశాడు....

మూడు సెకన్లలోనే కాటేసిన మృత్యువు

మనిషి మరణం ఎప్పుడు, ఏలా వస్తుందో తెలియదు. కన్నుమూసి తెరిచేలోపే మనిషి...