కవిత జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగింపు

Date:

ఢిల్లీ లిక్కర్ కేసులో భారాస ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్‌ కస్టడీని మే 20 వరకు రౌస్‌ అవెన్యూ ప్రత్యేక కోర్టు పొడిగించింది. ఈడీ కేసులో రిమాండ్‌ ముగియడంతో కవితను మంగళవారం వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా తిహాడ్‌ జైలు నుంచి హాజరు పర్చారు. దర్యాప్తు కొనసాగుతున్నందున రిమాండ్‌ పొడిగించాలని ఈడీ అధికారులు కోర్టును కోరారు. దర్యాప్తు సంస్థ విజ్ఞప్తి మేరకు కస్టడీని ఈనెల 20వరకు పొడిగించింది. ఎనిమిది వేల పేజీలతో సప్లిమెంటరీ చార్జిషీట్ దాఖలు చేసినట్లు ఈడీ.. కోర్టు దృష్టికి తీసుకువచ్చింది. ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జిషీట్ పరిగణనలోకి తీసుకునే అంశంపై ఈనెల 20న విచారణ చేస్తామని న్యాయస్థానం తెలిపింది.

Share post:

Popular

More like this
Related

షుగర్ సమస్య మహిళల కంటే పురుషుల్లోనే ఎక్కువ

షుగర్ సమస్యతో బాధ పడుతున్న మహిళలతో పోలిస్తే పురుషులు ఇతర అనారోగ్య...

ఐఐటీ చదివే విద్యార్థులకు స్కాలర్‌షిప్‌

ఐఐటీల్లో చదవాలని చాలా మంది విద్యార్థులు కలలుగంటారు. సీటు వచ్చిన వారికి...

అప్పు కట్టలేదని రైతు భార్యపిల్లలను తీసుకెళ్లిన మహిళ

వ్యవసాయం కోసం ఒక రైతు ఓ మహిళ వద్ద అప్పు చేశాడు....

మూడు సెకన్లలోనే కాటేసిన మృత్యువు

మనిషి మరణం ఎప్పుడు, ఏలా వస్తుందో తెలియదు. కన్నుమూసి తెరిచేలోపే మనిషి...