ఐసీయూలో చేరిన యువతిపై అత్యాచారం

Date:

అనారోగ్య సమస్య కారణంగా ఆసుపత్రిలో చేరిన 24 ఏళ్ల యువతిపై నర్సింగ్ అసిస్టెంట్ అత్యాచారానికి పాల్పడ్డారు. రాజస్థాన్‌లో దారుణం జరిగింది. పేషెంట్‌ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన నర్సింగ్ స్టాఫ్ మహిళపై అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ ఘటన అల్వార్ జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. ఐసీయూలో చేరిన 24 ఏళ్ల యువతిపై నర్సింగ్ అసిస్టెంట్ అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఉపిరితిత్తలు ఇన్ఫెక్షన్ కారణంగా సదరు యువతి ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడు చిరాగ్ యాదవ్ తెల్లవారుజామున 4 గంటలకు ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలిపారు.

తనకు మత్తుమందు ఇచ్చి స్పృహ కోల్పోయేలా చేశాడని యువతి ఆరోపించినట్లు పోలీస్ అధికారి తెలిపారు. యువతి మొబైల్‌కి ఆమె భర్త కాల్ చేయడంతో స్పృహలోకి వచ్చిందని, ఆ తర్వాత ఆమెపై జరిగిన అఘాయిత్యాన్ని కుటుంబ సభ్యులకు వివరించిందని పోలీసులు చెప్పారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని, అతను బెడ్ పైకి వెళ్లి, అడ్డుగా కర్టెన్లు కప్పి ఉన్న సీసీటీవీ ఫుటేజీని కూడా పరిశీలిస్తున్నామని వెల్లడించారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారిస్తు్న్నామన్నారు.

Share post:

Popular

More like this
Related

షుగర్ సమస్య మహిళల కంటే పురుషుల్లోనే ఎక్కువ

షుగర్ సమస్యతో బాధ పడుతున్న మహిళలతో పోలిస్తే పురుషులు ఇతర అనారోగ్య...

ఐఐటీ చదివే విద్యార్థులకు స్కాలర్‌షిప్‌

ఐఐటీల్లో చదవాలని చాలా మంది విద్యార్థులు కలలుగంటారు. సీటు వచ్చిన వారికి...

అప్పు కట్టలేదని రైతు భార్యపిల్లలను తీసుకెళ్లిన మహిళ

వ్యవసాయం కోసం ఒక రైతు ఓ మహిళ వద్ద అప్పు చేశాడు....

మూడు సెకన్లలోనే కాటేసిన మృత్యువు

మనిషి మరణం ఎప్పుడు, ఏలా వస్తుందో తెలియదు. కన్నుమూసి తెరిచేలోపే మనిషి...