ప్రపంచంలో ఎక్కడా లేని మద్యం బ్రాండ్లు ఏపీలో

Date:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం నిరుద్యోగుల కోసం సంక్రాంతికి జాబ్‌ క్యాలెండర్‌ ఇస్తామని గతంలో జగన్‌ హామీ ఇచ్చారు. కాని ఇప్పుడు ఆ ఉద్యోగాలెక్కడని ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రశ్నించారు. జగన్‌ సీఎం అయ్యాక 5 సంక్రాంతులొచ్చాయి.. ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారని ప్రశ్నించారు. ఒక్క జాబ్‌ క్యాలెండర్‌ అయినా వచ్చిందా? అని నిలదీశారు.

వైఎస్ఆర్‌ జిల్లా మైదుకూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడారు. ”పూర్తి మద్యపాన నిషేధమన్నారు.. ఏమైంది? జగన్‌ సర్కారే మద్యం అమ్ముతోంది. వాళ్లు ఏ బ్రాండ్‌ పెడితే అవే తాగాలట. ప్రపంచంలో ఎక్కడా లేని మద్యం బ్రాండ్లు ఏపీలో పెట్టారు. ప్రజలు నాసిరకం లిక్కర్‌ తాగి కిడ్నీలు దెబ్బతిని చనిపోతున్నారు. ఏపీలో ఎక్కడ చూసినా మాఫియాలే. వేల కేజీల్లో డ్రగ్స్‌ కంటైనర్లలో వస్తున్నాయి” అని షర్మిల ఆరోపించారు.

Share post:

Popular

More like this
Related

షుగర్ సమస్య మహిళల కంటే పురుషుల్లోనే ఎక్కువ

షుగర్ సమస్యతో బాధ పడుతున్న మహిళలతో పోలిస్తే పురుషులు ఇతర అనారోగ్య...

ఐఐటీ చదివే విద్యార్థులకు స్కాలర్‌షిప్‌

ఐఐటీల్లో చదవాలని చాలా మంది విద్యార్థులు కలలుగంటారు. సీటు వచ్చిన వారికి...

అప్పు కట్టలేదని రైతు భార్యపిల్లలను తీసుకెళ్లిన మహిళ

వ్యవసాయం కోసం ఒక రైతు ఓ మహిళ వద్ద అప్పు చేశాడు....

మూడు సెకన్లలోనే కాటేసిన మృత్యువు

మనిషి మరణం ఎప్పుడు, ఏలా వస్తుందో తెలియదు. కన్నుమూసి తెరిచేలోపే మనిషి...