ప్రజాస్వామ్యం బతకాలంటే ప్రజల్లో మార్పు రావాలి

Date:

ఎమ్మెల్యే, ఎంపీగా ఎన్నిక కావాలంటే రూ.కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితి వచ్చింది. ప్రజాస్వామ్యం బతకాలంటే ముందు ప్రజల్లో చైతన్యం రావాలని ప్రజలు ఉదాసీనంగా ఉన్నంత కాలం ఎన్ని నిబంధనలు ఉన్నా అమలు కావని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ అన్నారు. సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ ఆధ్వర్యంలో విజయవాడలో జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. వ్యక్తిగత స్వలాభం.. వ్యవస్థలకు చేటు తెస్తుందన్నారు. న్యాయం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలని.. లేదంటే ఆ దుష్పలితాలను తప్పకుండా ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు.

స్వాతంత్య్రం తరువాత ప్రజల మంచికోసం రాజ్యాంగం రాశారని, మారుతున్న సమాజంతో పాటు కొన్ని మార్పులు అనివార్యమన్నారు. కానీ, మూల విధానాలు, నిబంధనలు అలాగే ఉంటాయన్నారు. తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ మీడియా సమావేశం పెడితే.. సోషల్‌ మీడియాలో తెగ ట్రోల్‌ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను మెచ్చుకున్నోళ్లు.. తిట్టినోళ్లు ఉన్నారని, విమర్శలు తీసుకున్నోళ్లే ప్రజాస్వామ్య వాది అని పేర్కొన్నారు. సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. స్వేచ్ఛగా ఎన్నికలు జరగడం ఇప్పుడు చాలా ముఖ్యమన్నారు. జస్టిస్‌ చలమేశ్వర్‌ వంటి వారు ఓటు హక్కు, స్వేచ్ఛకు సంబంధించి గతంలో తీర్పులు వెలువరించారని గుర్తు చేశారు. తన పోరాటం ద్వారా, చలమేశ్వర్ తీర్పు ఆధారంగా మూడేళ్ల తరువాత తనకు ఇక్కడ ఓటు హక్కు వచ్చిందని గుర్తుచేసుకున్నారు. ప్రభుత్వ అధికారులు నిబద్ధతతో పని చేయకుంటే ఇబ్బందులు పడతారని హెచ్చరించారు.

Share post:

Popular

More like this
Related

షుగర్ సమస్య మహిళల కంటే పురుషుల్లోనే ఎక్కువ

షుగర్ సమస్యతో బాధ పడుతున్న మహిళలతో పోలిస్తే పురుషులు ఇతర అనారోగ్య...

ఐఐటీ చదివే విద్యార్థులకు స్కాలర్‌షిప్‌

ఐఐటీల్లో చదవాలని చాలా మంది విద్యార్థులు కలలుగంటారు. సీటు వచ్చిన వారికి...

అప్పు కట్టలేదని రైతు భార్యపిల్లలను తీసుకెళ్లిన మహిళ

వ్యవసాయం కోసం ఒక రైతు ఓ మహిళ వద్ద అప్పు చేశాడు....

మూడు సెకన్లలోనే కాటేసిన మృత్యువు

మనిషి మరణం ఎప్పుడు, ఏలా వస్తుందో తెలియదు. కన్నుమూసి తెరిచేలోపే మనిషి...