లక్షా 40 వేల ఫోన్ నెంబర్లు బ్లాక్

Date:

దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న డిజిటల్ మోసాలను ఎదుర్కోవడంలో భారత ప్రభుత్వం నిర్ణయాత్మక చర్య తీసుకుంది. తాజాగా ఆన్‌లైన్‌లో ప్రజలను మోసం చేయడానికి ఉపయోగించిన 1.4 లక్షల మొబైల్ నంబర్లు, హ్యాండ్‌సెట్లను బ్లాక్ చేసింది. ఆర్థిక సేవల రంగంలో సైబర్ భద్రతపై చర్చించేందుకు ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్ జోషి నేతృత్వంలో ప్రభుత్వ అధికారులు సమావేశమయ్యారు. అక్రమాలకు ఉపయోగిస్తున్న ఫోన్ నంబర్లను బ్లాక్ చేయడంతో పాటు, ప్రతిష్టాత్మక సంస్థలకు చెందిన అధికారులు వివిధ అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.

ఫేక్ లేదా నకిలీ పత్రాలపై తీసుకున్న మొబైల్ కనెక్షన్లను గుర్తించేందుకు ఏఐ-మెషిన్ లెర్నింగ్ ఆధారిత ఇంజన్ అయిన ASTRను టెలీ కమ్యూనికేషన్ విభాగం అభివృద్ధి చేసింది. బల్క్ ఎస్ఎంఎస్ లు పంపుతున్న 35 లక్షల ప్రిన్సిపల్ ఎంటిటీలను దీని ద్వారా విశ్లేషించింది. ఇది హానికరమైన ఎస్ఎంఎస్ లు పంపిన వారిని బ్లాక్ లిస్ట్ చేసింది లేదా డిస్‌కనెక్ట్ చేసింది. ఇప్పటి వరకు 500 కంటే ఎక్కువ అరెస్టులు జరిగాయి. ఏప్రిల్ 2023 నుంచి దాదాపు 3.08 లక్షల సిమ్‌లు, 50,000 IMEIలు, 592 ఫేక్ లింక్‌లు లేదా APKలు, 2,194 URLలను బ్లాక్ చేశారు.

Share post:

Popular

More like this
Related

షుగర్ సమస్య మహిళల కంటే పురుషుల్లోనే ఎక్కువ

షుగర్ సమస్యతో బాధ పడుతున్న మహిళలతో పోలిస్తే పురుషులు ఇతర అనారోగ్య...

ఐఐటీ చదివే విద్యార్థులకు స్కాలర్‌షిప్‌

ఐఐటీల్లో చదవాలని చాలా మంది విద్యార్థులు కలలుగంటారు. సీటు వచ్చిన వారికి...

అప్పు కట్టలేదని రైతు భార్యపిల్లలను తీసుకెళ్లిన మహిళ

వ్యవసాయం కోసం ఒక రైతు ఓ మహిళ వద్ద అప్పు చేశాడు....

మూడు సెకన్లలోనే కాటేసిన మృత్యువు

మనిషి మరణం ఎప్పుడు, ఏలా వస్తుందో తెలియదు. కన్నుమూసి తెరిచేలోపే మనిషి...