వైసీపీకి ఓటు వేసిందని తల్లిని హత్య చేసిన కొడుకు

Date:

వైసీపీకి ఓటు వేసిందన్న కోపంతో కన్న తల్లిని, కొడుకు హత్య చేసిన సంఘటన అనంతపురం జిల్లాలో స్థానికంగా కలకలం రేపింది. అనంతపురం జిల్లా కంబదూరు మండలం ఎగువపల్లి గ్రామానికి చెందిన వడ్డే సుంకమ్మకు(45) కుమారుడు వడ్డే వెంకటేశులు ఉన్నాడు. అతడు తెలుగుదేశంలో పార్టీలో పని చేస్తున్నట్లు సమాచారం.

సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేశానని మాటల సందర్భంలో సుంకమ్మ కొడుకుకు తెలిపింది. దీంతో కోపంతో ఊగిపోయిన వెంకటేశులు మద్యం సేవించి ఇంటికి వచ్చి తల్లితో గొడవకి దిగాడు. మాటమాట పెరిగి క్షణికావేశంలో కన్నతల్లి తలపై ఇనుప సుత్తితో బాది హత్య పరారయ్యాడు. సమాచారం అందుకున్న కంబ దూరు పోలీసులు హత్య జరిగిన ప్రాంతానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. పరారీలో ఉన్న వడ్డే వెంకటేశులు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Share post:

Popular

More like this
Related

షుగర్ సమస్య మహిళల కంటే పురుషుల్లోనే ఎక్కువ

షుగర్ సమస్యతో బాధ పడుతున్న మహిళలతో పోలిస్తే పురుషులు ఇతర అనారోగ్య...

ఐఐటీ చదివే విద్యార్థులకు స్కాలర్‌షిప్‌

ఐఐటీల్లో చదవాలని చాలా మంది విద్యార్థులు కలలుగంటారు. సీటు వచ్చిన వారికి...

అప్పు కట్టలేదని రైతు భార్యపిల్లలను తీసుకెళ్లిన మహిళ

వ్యవసాయం కోసం ఒక రైతు ఓ మహిళ వద్ద అప్పు చేశాడు....

మూడు సెకన్లలోనే కాటేసిన మృత్యువు

మనిషి మరణం ఎప్పుడు, ఏలా వస్తుందో తెలియదు. కన్నుమూసి తెరిచేలోపే మనిషి...