తెలంగాణలో రాగల నాలుగు రోజులు వర్షాలు

Date:

తెలంగాణ రాష్ట్రంలో రాగల నాలుగు రోజులు తెలంగాణవ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. సోమవారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ వానలు కురిసే అవకాశాలున్నాయని చెప్పింది.

మంగళవారం ఉమ్మది ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, వనపర్తి, నారాయణపే, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వానలు పడుతాయని చెప్పింది. బుధ, గురువారాల్లోనూ పలు జిల్లాల్లో వానలు పడే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వివరించింది.

Share post:

Popular

More like this
Related

షుగర్ సమస్య మహిళల కంటే పురుషుల్లోనే ఎక్కువ

షుగర్ సమస్యతో బాధ పడుతున్న మహిళలతో పోలిస్తే పురుషులు ఇతర అనారోగ్య...

ఐఐటీ చదివే విద్యార్థులకు స్కాలర్‌షిప్‌

ఐఐటీల్లో చదవాలని చాలా మంది విద్యార్థులు కలలుగంటారు. సీటు వచ్చిన వారికి...

అప్పు కట్టలేదని రైతు భార్యపిల్లలను తీసుకెళ్లిన మహిళ

వ్యవసాయం కోసం ఒక రైతు ఓ మహిళ వద్ద అప్పు చేశాడు....

మూడు సెకన్లలోనే కాటేసిన మృత్యువు

మనిషి మరణం ఎప్పుడు, ఏలా వస్తుందో తెలియదు. కన్నుమూసి తెరిచేలోపే మనిషి...