పోలింగ్ రోజు రాపిడో బంపర్ ఆఫర్

Date:

ఓటు వేయడానికి వేళ్లే వారికి బైక్ ట్యాక్సీ సేవల సంస్థ రాపిడో బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఉచితంగా సేవలు అందించనుంది. మే 13న పోలింగ్ రోజు హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని ఓటర్లకు ఉచిత వాహన సేవలను అందించనుంది. దేశవ్యాప్త ప్రచారంలో భాగంగా, పోలింగ్ రోజున ఓటింగ్‌ను ప్రోత్సహించడానికి రాపిడో తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారితో కలిసి పని చేస్తుంది.

పోలింగ్ రోజున 100 నగరాల్లో 10 లక్షల మంది ఓటర్లకు సర్వీస్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాలు మల్కాజిగిరి, సికింద్రాబాద్, చేవెళ్ల వంటి వివిధ లోక్‌సభ స్థానాల పరిధిలోకి ఓటర్లు ఈ ఉచిత సర్వీస్ ను ఉపయోగించుకోవచ్చు. హైదరాబాద్‌లోని ఎల్‌బి స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ సిఇఒ వికాస్ రాజ్, రాపిడో చొరవను ప్రశంసించారు.

Share post:

Popular

More like this
Related

షుగర్ సమస్య మహిళల కంటే పురుషుల్లోనే ఎక్కువ

షుగర్ సమస్యతో బాధ పడుతున్న మహిళలతో పోలిస్తే పురుషులు ఇతర అనారోగ్య...

ఐఐటీ చదివే విద్యార్థులకు స్కాలర్‌షిప్‌

ఐఐటీల్లో చదవాలని చాలా మంది విద్యార్థులు కలలుగంటారు. సీటు వచ్చిన వారికి...

అప్పు కట్టలేదని రైతు భార్యపిల్లలను తీసుకెళ్లిన మహిళ

వ్యవసాయం కోసం ఒక రైతు ఓ మహిళ వద్ద అప్పు చేశాడు....

మూడు సెకన్లలోనే కాటేసిన మృత్యువు

మనిషి మరణం ఎప్పుడు, ఏలా వస్తుందో తెలియదు. కన్నుమూసి తెరిచేలోపే మనిషి...