అబ్బాయిలతో ఫోన్ మాట్లాడొద్దని హెచ్చరించిన అన్న

Date:

అబ్బాయిలతో ఫోన్‌ ఎందుకు మాట్లాడుతున్నావని మందలించినందుకు ఓ 14 ఏండ్ల బాలిక తన అన్నని నరికి చంపింది. ఛత్తీస్‌గఢ్‌లోని ఖైరాగఢ్‌ చుయిఖదాన్‌ గండై జిల్లాలో జరిగిన దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

గ్రామానికి చెందిన 14 ఏండ్ల బాలిక తరచూ ఫోన్‌లో అబ్బాయిలతో మాట్లాడుతున్నది. గమనించిన ఆమె అన్న (18).. ఇకపై ఫోన్‌లో అబ్బాయిలతో మాట్లాడొద్దని ఈ నెల 3న హెచ్చరించాడు. మొబైల్‌ వాడటానికి వీళ్లేదని చెప్పాడు. దీంతో అన్నపై కోపంతో రగిలిపోయిన ఆమె.. అతడు నిద్రపోతున్న సమయంలో గొడ్డలి తీసుకుని మెడపై నరికింది. తీవ్రంగా గాయపడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు.

రక్తపు మరకలు కావడంతో స్నానం చేసిన ఆమె.. ఆ దుస్తులను దాచిపెట్టింది. అనంతరం తన అన్నని ఎవరో హత్యచేశారని ఇరుగుపొరుగువారికి చెప్పింది. దీంతో స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిసరాలను పరిశీలించారు. బాలికను తమదైన శైలిలో ప్రశ్నించడంతో నేరాన్ని ఒప్పుకున్నది. అన్నని తానే చంపానని, ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరని వెల్లడించింది. ఫోన్‌లో మాట్లాడినందకు తనను దూషించడాని.. అందుకే చంపేశానని తెలిపింది.

Share post:

Popular

More like this
Related

షుగర్ సమస్య మహిళల కంటే పురుషుల్లోనే ఎక్కువ

షుగర్ సమస్యతో బాధ పడుతున్న మహిళలతో పోలిస్తే పురుషులు ఇతర అనారోగ్య...

ఐఐటీ చదివే విద్యార్థులకు స్కాలర్‌షిప్‌

ఐఐటీల్లో చదవాలని చాలా మంది విద్యార్థులు కలలుగంటారు. సీటు వచ్చిన వారికి...

అప్పు కట్టలేదని రైతు భార్యపిల్లలను తీసుకెళ్లిన మహిళ

వ్యవసాయం కోసం ఒక రైతు ఓ మహిళ వద్ద అప్పు చేశాడు....

మూడు సెకన్లలోనే కాటేసిన మృత్యువు

మనిషి మరణం ఎప్పుడు, ఏలా వస్తుందో తెలియదు. కన్నుమూసి తెరిచేలోపే మనిషి...