ఆస్తి కోసం భర్తను హింసించిన భార్య

Date:

ఆస్తి కోసం కట్టుకున్న భర్తను గొలుసులతో కట్టేసి భార్య హింసించిన దారుణ సంఘటన మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీలోని అంబేద్కర్ నగర్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పత్తి కృష్ణ(50), భారతి (45) దంపతులు అంబేద్కర్‌ నగర్‌లో నివాసముంటున్నారు.

రెండు ఫ్లాట్ల విషయంలో వీరి మధ్య గొడవ జరిగింది. భార్యతో పడలేని కృష్ణ సంవత్సరం క్రితం ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. కృష్ణ ఆచూకీ తెలుసుకున్న భార్య భారతి మూడు రోజుల క్రితం అతడిని పట్టుకొచ్చి గొలుసులతో కట్టి ఇంట్లో బంధించింది. విషయం తెలుసుకున్న పోలీసులు వెళ్లి కృష్ణను విముక్తి చేశారు. కాగా, 3 రోజుల నుంచి తనను కొడుతూ బాధలు పెట్టారని పోలీసుల ముందు బాధితుడు బోరున ఏడ్చాడు.

Share post:

Popular

More like this
Related

షుగర్ సమస్య మహిళల కంటే పురుషుల్లోనే ఎక్కువ

షుగర్ సమస్యతో బాధ పడుతున్న మహిళలతో పోలిస్తే పురుషులు ఇతర అనారోగ్య...

ఐఐటీ చదివే విద్యార్థులకు స్కాలర్‌షిప్‌

ఐఐటీల్లో చదవాలని చాలా మంది విద్యార్థులు కలలుగంటారు. సీటు వచ్చిన వారికి...

అప్పు కట్టలేదని రైతు భార్యపిల్లలను తీసుకెళ్లిన మహిళ

వ్యవసాయం కోసం ఒక రైతు ఓ మహిళ వద్ద అప్పు చేశాడు....

మూడు సెకన్లలోనే కాటేసిన మృత్యువు

మనిషి మరణం ఎప్పుడు, ఏలా వస్తుందో తెలియదు. కన్నుమూసి తెరిచేలోపే మనిషి...