డ్రై ఐస్ తిని మూడేళ్ల బాలుడు మృతి

Date:

వివాహ వేడుకలో ఓ మూడేళ్ల బాలుడు ఐస్‌గా భావించి డ్రై ఐస్ తినడంతో మృతి చెందిన ఘటన చత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్‌ ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజ్‌నంద్‌గావ్‌ ప్రాంతంలో జరిగిన వివాహానికి మూడేళ్ల పిల్లాడు ఖుశాంత్ సాహు తన కుటుంబంతో కలిసివెళ్లాడు. వివాహ వేడుకలో స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం నిర్వాహకులు డ్రై ఐస్ ను ఉపయోగించారు. ఐస్‌గా భావించిన ఓ చిన్నారి దానిని తిన్నాడు. అనంతరం బాలుడు అస్వస్థతకు గురవడంతో కుటుంబసభ్యులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చిన్నారి మరణించినట్లుగా వైద్యులు తెలిపారు.

డ్రై ఐస్‌ను మౌత్ ఫ్రెష్‌నర్‌గా భావించి తినడం వల్ల ఐదుగురు వ్యక్తులు ఆసుపత్రి పాలైన ఘటన ఇటీవల గురుగ్రామ్‌లోని ఓ కేఫ్‌లో చోటుచేసుకుంది. బాధితులు నోట్లో మంటతో రక్తపు వాంతులు చేసుకున్నారు.

Share post:

Popular

More like this
Related

షుగర్ సమస్య మహిళల కంటే పురుషుల్లోనే ఎక్కువ

షుగర్ సమస్యతో బాధ పడుతున్న మహిళలతో పోలిస్తే పురుషులు ఇతర అనారోగ్య...

ఐఐటీ చదివే విద్యార్థులకు స్కాలర్‌షిప్‌

ఐఐటీల్లో చదవాలని చాలా మంది విద్యార్థులు కలలుగంటారు. సీటు వచ్చిన వారికి...

అప్పు కట్టలేదని రైతు భార్యపిల్లలను తీసుకెళ్లిన మహిళ

వ్యవసాయం కోసం ఒక రైతు ఓ మహిళ వద్ద అప్పు చేశాడు....

మూడు సెకన్లలోనే కాటేసిన మృత్యువు

మనిషి మరణం ఎప్పుడు, ఏలా వస్తుందో తెలియదు. కన్నుమూసి తెరిచేలోపే మనిషి...