స్కూల్స్‌లోకి టీచర్లు తుపాకులు తీసుకెళ్లొచ్చు

Date:

టీచర్లు స్కూల్స్‌లోకి తుపాకులు తీసుకెళ్లేందుకు అగ్రరాజ్యంగా పేరుగాంచిన అమెరికాలోని టెన్నెస్సీ స్టేట్ హౌస్ ఆమోదం తెలుపుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికాలో గన్ కల్చర్ పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే స్కూల్స్‌లోకి ఈ తుపాకీ సంస్కృతి చేరడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వివాదాస్పద బిల్లుపై ఏకంగా సభలోనే నిరసనలు వ్యక్తమైన బిల్లు మాత్రం పాస్ అయ్యింది.

అగ్రరాజ్యం అమెరికాలో తుపాకీ సంస్కృతి రోజురోజుకు పెరిగిపోతుంది. ఈ గన్ కల్చర్‌పై ప్రజలు ఆందోళన చెందుతున్న సంగతి తెలిసిందే. తుపాకీలతో దాడులు పెరగుతున్న నేపథ్యంలో వాటిని అరికట్టాలని.. తుపాకీ వినియోగంపై ఆంక్షలు విధించాలని ప్రజలు రోడ్డెక్కినిరసన తెలుపుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో ఏకంగా స్కూల్‌లోకి తుపాకులు తీసుకెళ్లేందుకు టీచర్లకు అనుమతినిచ్చే బిల్లుకు అమెరికాలోని టెన్నెస్సీ స్టేట్ హౌస్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు పాస్ చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సభలో బిల్లుపై చర్చ జరుగుతుండగా సందర్శకులుగా హాజరైన పలువురు టీచర్లు, స్టూడెంట్లు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బిల్లును పాస్ చేస్తూ సభలో స్పీకర్ తీర్మానం చదువుతుండగా ‘బ్లడ్ ఆన్ యువర్ హ్యాండ్స్’ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. అంతేకాదు సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించారు. దీంతో స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం సందర్శకుల గ్యాలరీ ఖాళీ చేయించి మరీ బిల్లును పాస్ చేశారు. 

Share post:

Popular

More like this
Related

షుగర్ సమస్య మహిళల కంటే పురుషుల్లోనే ఎక్కువ

షుగర్ సమస్యతో బాధ పడుతున్న మహిళలతో పోలిస్తే పురుషులు ఇతర అనారోగ్య...

ఐఐటీ చదివే విద్యార్థులకు స్కాలర్‌షిప్‌

ఐఐటీల్లో చదవాలని చాలా మంది విద్యార్థులు కలలుగంటారు. సీటు వచ్చిన వారికి...

అప్పు కట్టలేదని రైతు భార్యపిల్లలను తీసుకెళ్లిన మహిళ

వ్యవసాయం కోసం ఒక రైతు ఓ మహిళ వద్ద అప్పు చేశాడు....

మూడు సెకన్లలోనే కాటేసిన మృత్యువు

మనిషి మరణం ఎప్పుడు, ఏలా వస్తుందో తెలియదు. కన్నుమూసి తెరిచేలోపే మనిషి...