ఏపీలో నాలుగు బహిరంగసభల్లో మోడీ

Date:

దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో అన్ని పార్టీలు ప్రచార వేగం పెంచాయి. ఏపీలో నోటిఫికేషన్‌ విడుదల కావడంతో ఎన్డీఏ కూటమి నేతలు కూడా దూకుడు పెంచారు. 3 పార్టీల నేతలు కలిసి పాల్గొన్న సభలకు ప్రజల నుంచి విశేష స్పందన రావడంతో ఉమ్మడిగా నిర్వహించే సభలపై ప్రణాళిక రూపొందిస్తున్నట్టు సమాచారం. ఇందులో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్రమోదీ రాష్ట్రంలో నాలుగు బహిరంగ సభల్లో పాల్గొంటారని కూటమి నేతలు చెబుతున్నారు.

బిజెపి అభ్యర్థులు పోటీ చేస్తున్న అనకాపల్లి, రాజమహేంద్రవరం, కడప లేదా రాజంపేట, మరో నియోజకవర్గంలో ఏర్పాటు చేసే సభల్లో మోడీతో పాటు, తెదేపా అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్‌ కల్యాణ్‌ పాల్గొంటారని సమాచారం. ఈలోగా వీలైనన్ని సభల్లో ఉమ్మడి ప్రచారం చేయాలని చంద్రబాబు, పవన్‌ నిర్ణయించారు. ఈనెల 24న రాయలసీమలోని రాజంపేట, రైల్వే కోడూరు సభల్లో ఇద్దరు నేతలు పాల్గొననున్నారు. 19న ఆలూరు, రాయదుర్గం, 20న గూడూరు, సర్వేపల్లి, సత్యవేడు ప్రజాగళం సభల్లో చంద్రబాబు పాల్గొననున్నారు.

Share post:

Popular

More like this
Related

షుగర్ సమస్య మహిళల కంటే పురుషుల్లోనే ఎక్కువ

షుగర్ సమస్యతో బాధ పడుతున్న మహిళలతో పోలిస్తే పురుషులు ఇతర అనారోగ్య...

ఐఐటీ చదివే విద్యార్థులకు స్కాలర్‌షిప్‌

ఐఐటీల్లో చదవాలని చాలా మంది విద్యార్థులు కలలుగంటారు. సీటు వచ్చిన వారికి...

అప్పు కట్టలేదని రైతు భార్యపిల్లలను తీసుకెళ్లిన మహిళ

వ్యవసాయం కోసం ఒక రైతు ఓ మహిళ వద్ద అప్పు చేశాడు....

మూడు సెకన్లలోనే కాటేసిన మృత్యువు

మనిషి మరణం ఎప్పుడు, ఏలా వస్తుందో తెలియదు. కన్నుమూసి తెరిచేలోపే మనిషి...