గణతంత్ర వేడుకల్లో చీరల ప్రదర్శన

Date:

దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో నిర్వహించిన వేడుకల్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ గణతంత్ర వేడుకలకు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మాక్రాన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రిపబ్లిక్‌ డే పరేడ్‌ సందర్భంగా ‘అనంత్‌ సూత్ర’ పేరిట చేసిన చీరల ప్రదర్శన ఆకట్టుకుంది. దేశ నలుమూలల నుంచి తీసుకొచ్చిన 1,900 చీరలను ఇక్కడ ప్రదర్శించారు. కార్యక్రమానికి విచ్చేసిన ప్రేక్షకుల వెనుక భాగంలో ప్రదర్శించిన ఈ చీరలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక ఈ చీరలకు QR కోడ్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఆ క్యూఆర్‌ కోడ్‌పై స్కాన్‌ చేస్తే చీర ప్రత్యేకత, ఏ ప్రాంతానికి చెందిన చీర, ఎంబ్రాయిడరీ వర్క్‌ గురించిన వివరాలు తెలుసుకోవచ్చు.

ఈ రిపబ్లిక్‌ డే వేడుకల్లో దేశంలోని కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మొత్తం 15 వందల మంది మహిళా, పురుష కళాకారులు ఈ సాంస్కృతిక ప్రదర్శనల్లో పాల్గొన్నారు. ఈ ప్రదర్శనలు దేశంలోని భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచాయి. కింది వీడియోలో ఆ దృశ్యాలను మీరు కూడా వీక్షించవచ్చు.

Share post:

Popular

More like this
Related

షుగర్ సమస్య మహిళల కంటే పురుషుల్లోనే ఎక్కువ

షుగర్ సమస్యతో బాధ పడుతున్న మహిళలతో పోలిస్తే పురుషులు ఇతర అనారోగ్య...

ఐఐటీ చదివే విద్యార్థులకు స్కాలర్‌షిప్‌

ఐఐటీల్లో చదవాలని చాలా మంది విద్యార్థులు కలలుగంటారు. సీటు వచ్చిన వారికి...

అప్పు కట్టలేదని రైతు భార్యపిల్లలను తీసుకెళ్లిన మహిళ

వ్యవసాయం కోసం ఒక రైతు ఓ మహిళ వద్ద అప్పు చేశాడు....

మూడు సెకన్లలోనే కాటేసిన మృత్యువు

మనిషి మరణం ఎప్పుడు, ఏలా వస్తుందో తెలియదు. కన్నుమూసి తెరిచేలోపే మనిషి...