మనిషి చనిపోతే అతని బ్యాంకు అకౌంట్ ఏమవుతుంది

Date:

మనిషికి మరణం ఎప్పుడు, ఏలా వస్తుందో తెలియదు. మనిషి ఆకస్మికంగా చనిపోతే, అతని ఇన్వెస్ట్‌మెంట్స్, బ్యాంక్‌ అకౌంట్స్ ఏమవుతాయి. వాస్తవానికి బ్యాంక్‌ అకౌంట్‌ చాలా కాలం పాటు వినియోగించకుండా ఉంటే అన్‌క్లెయిమ్డ్‌ కేటగిరీలోకి వెళ్తుంది. అలానే ఇన్వెస్ట్‌మెంట్‌ మెచ్యూర్‌ అయినా అమౌంట్ పెట్టుబడిదారుడి అకౌంట్‌లోకి క్రెడిట్‌ కాకపోతే బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు ‘అన్‌క్లెయిమ్డ్‌ కేటగిరీ’లోకి చేరుస్తాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెగ్యులేషన్‌ ప్రకారం, ఒక అకౌంట్ లేదా మెచ్యూరిటీ అమౌంట్‌ 10 సంవత్సరాల పాటు ఇన్‌ఆపరేటివ్‌గా ఉంటే, అన్‌క్లెయిమ్డ్ కేటగిరీలోకి వెళ్తుంది.

వ్యక్తులు అకస్మాత్తుగా మరణించినప్పుడు, వారి బ్యాంకు ఖాతాలు, పెట్టుబడుల గురించి కుటుంబంలో ఎవరికీ తెలియనప్పుడు, వారి ఖాతాలోని డబ్బు, పెట్టుబడులు అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్స్‌లోకి వెళ్తాయి. వారి ఆర్థిక శ్రమ మొత్తం వృథా అవుతుంది. కాబట్టి, మీరు అకస్మాత్తుగా మరణిస్తే అటువంటి పరిస్థితిని నివారించడానికి ఏం చేయాలి? మీ బ్యాంక్ ఖాతాలు, పెట్టుబడుల గురించి కుటుంబానికి ఎలా తెలియజేయవచ్చో చూద్దాం.

*కుటుంబానికి ఆర్థిక సమాచారం కీలకం

మీరు ఆకస్మికంగా మరణిస్తే మీ కుటుంబానికి ఏ ఆర్థిక సమాచారం ముఖ్యమైనదో మీరు తప్పనిసరిగా నిర్ధారించుకోవాలి. ఇది మీ అన్ని సేవింగ్స్‌, ప్రస్తుత బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన వివరాలు కావచ్చు. బ్యాంక్ వివరాల కోసం, బ్యాంక్ పేరు, శాఖ, ఖాతా నంబర్, ఖాతా పేరు, ఖాతా రకం, నామినేషన్ వివరాలు మొదలైన సమాచారం కీలకం. పెట్టుబడులకు సంబంధించి, పెట్టుబడి రకం, ప్రతి పెట్టుబడి పథకంలోని డబ్బు, నామినీ వివరాలు, ప్రతి పెట్టుబడి ఖాతా సంఖ్య మొదలైన సమాచారం అవసరం.

*ఫిజికల్‌ ఫోల్డర్‌

మీకు సంబంధించిన అన్ని పెట్టుబడుల లిస్ట్ రూపొందించండి. కాగితంపై రాసి, ప్రతి ఫైనాన్షియల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌కి సంబంధించి అవసరమైన అన్ని వివరాలను పేర్కొనండి. మీరు క్రియేట్ చేసిన లిస్టుతో పాటు అన్ని పెట్టుబడులకు సంబంధించిన పేపర్స్, ప్రూఫ్‌లతో కూడిన ఫిజికల్‌ ఫోల్డర్‌ను క్రియేట్‌ చేయండి. ఫోల్డర్‌ను మీ బ్యాంక్ లాకర్ లేదా సేఫ్టీ వాల్ట్‌లో ఉంచవచ్చు. దాని గురించి మీ కుటుంబ సభ్యులకు తెలియజేయవచ్చు.

*అదనపు భద్రత కోసం క్లౌడ్ స్టోరేజ్‌

అదనపు భద్రత కోసం మీరు మీ ఇమెయిల్ ఫోల్డర్ లేదా గూగుల్‌ డిస్క్ వంటి క్లౌడ్ స్టోరేజ్‌లో పెట్టుబడి వివరాల డిజిటల్ కాపీని ఉంచవచ్చు.

*వీలునామాలో ఆస్తుల వివరాలు

మీ కెరీర్‌లో వీలైనంత త్వరగా వీలునామా చేయండి. వీలునామాలో అన్ని ఆస్తుల వివరాలను తప్పనిసరిగా పేర్కొనాలి. పెట్టుబడులు, బీమా, బ్యాంక్ ఖాతాలు, ప్రతి ఇన్‌స్ట్రుమెంట్‌కి లింక్ అయిన నామినీ వివరాలను కూడా చేర్చాలి. మీ ఇష్టాన్ని ఎప్పటికప్పుడు సమీక్షించుకోండి. కొత్త బ్యాంక్ అకౌంట్‌ ఓపెన్‌ చేసినా లేదా కొత్త పెట్టుబడి పెట్టినా, అది మీ వీలునామాలో కూడా అప్‌డేట్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకోవాలి. వీటితోపాటు క్రెడిట్ కార్డ్‌, బాకీ ఉన్న అప్పుల వివరాలు, జీవిత బీమా వంటి ఇతర కీలకమైన ఆర్థిక సమాచారాన్ని వారితో పంచుకోవడం కూడా ముఖ్యం. పాలసీలు, ఇతరులకు అప్పుగా ఇచ్చిన డబ్బు వివరాలు కూడా తెలియజేయాలి.

Share post:

Popular

More like this
Related

షుగర్ సమస్య మహిళల కంటే పురుషుల్లోనే ఎక్కువ

షుగర్ సమస్యతో బాధ పడుతున్న మహిళలతో పోలిస్తే పురుషులు ఇతర అనారోగ్య...

ఐఐటీ చదివే విద్యార్థులకు స్కాలర్‌షిప్‌

ఐఐటీల్లో చదవాలని చాలా మంది విద్యార్థులు కలలుగంటారు. సీటు వచ్చిన వారికి...

అప్పు కట్టలేదని రైతు భార్యపిల్లలను తీసుకెళ్లిన మహిళ

వ్యవసాయం కోసం ఒక రైతు ఓ మహిళ వద్ద అప్పు చేశాడు....

మూడు సెకన్లలోనే కాటేసిన మృత్యువు

మనిషి మరణం ఎప్పుడు, ఏలా వస్తుందో తెలియదు. కన్నుమూసి తెరిచేలోపే మనిషి...