టీఎస్పీఎస్సీ ఛైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి

Date:

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్‌గా మాజీ డీజీపీ ఎం. మహేందర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆమోద ముద్ర వేశారు. మహేందర్ రెడ్డితో పాటు టీఎస్పీఎస్సీ సభ్యులుగా ఐఏఎస్ అనిత రాజేంద్ర, పాల్వాయి రజిని కుమారి, అమీర్ ఉల్లా ఖాన్, యాదయ్య, వై. రామ్మోహన్ రావులు బాధ్యతలు చేపట్టనున్నారు. అంతకు ముందు ఈ పదవిలో జనార్దన్ రెడ్డి ఉన్న విషయం తెలిసిందే. పలు కారణాలతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఆయనతో పాటు పలువురు సభ్యులు కూడా రాజీనామా చేశారు.

మరోవైపు టీఎస్పీఎస్సీలో సభ్యుల నియామకాలు భర్తీ చేసేందుకు ప్రభుత్వం అర్హత గల వారి నుంచి దరఖాస్తులు స్వీకరించింది. వీటిని పరిశీలించిన సర్కార్.. మహేందర్ రెడ్డి పేరును ఖరారు చేసింది. సభ్యుల నియామకం కూడా పూర్తి కావడంతో త్వరలోనే కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వచ్చే అవాకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత టీఎస్పీఎస్సీ తొలి చైర్మన్‌గా ఘంటా చక్రపాణి పని చేశారు. ఆ తర్వాత ఐఏఎస్ అధికారి జనార్దన్ రెడ్డి పని చేశారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వంటి అంశాల కారణంగా చైర్మన్ జనార్దన్ రెడ్డి, పాత సభ్యులు రాజీనామా చేశారు. వీటిని భర్తీ చేసేందుకు అర్హతగల వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. చైర్మన్‌ సహా వివిధ పోస్టులకు దాదాపు 600 మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న వారిలో రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్, ప్రొఫెసర్లు ఉన్నారు. తాజాగా చైర్మన్ పదవికి మహేందర్ రెడ్డి పేరును ఖరారు చేశారు.

Share post:

Popular

More like this
Related

షుగర్ సమస్య మహిళల కంటే పురుషుల్లోనే ఎక్కువ

షుగర్ సమస్యతో బాధ పడుతున్న మహిళలతో పోలిస్తే పురుషులు ఇతర అనారోగ్య...

ఐఐటీ చదివే విద్యార్థులకు స్కాలర్‌షిప్‌

ఐఐటీల్లో చదవాలని చాలా మంది విద్యార్థులు కలలుగంటారు. సీటు వచ్చిన వారికి...

అప్పు కట్టలేదని రైతు భార్యపిల్లలను తీసుకెళ్లిన మహిళ

వ్యవసాయం కోసం ఒక రైతు ఓ మహిళ వద్ద అప్పు చేశాడు....

మూడు సెకన్లలోనే కాటేసిన మృత్యువు

మనిషి మరణం ఎప్పుడు, ఏలా వస్తుందో తెలియదు. కన్నుమూసి తెరిచేలోపే మనిషి...