ప్రస్తుత సమాజంలో దాదాపుగా ప్రతి ఒక్కరి అరచేతిలో మొబైల్ ఫోన్ మామూలైపోయింది. మొబైల్ ఫోన్లో వారు ఏం చేస్తున్నారో, ఏం చూస్తున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఈ మధ్య కాలంలో చాలా మంది యువతీ యువకులు పోర్నోగ్రఫీ ఉచ్చులో చిక్కుకుపోతున్నారు. పోర్న్ వీడియోలను ఎక్కువగా చూస్తూ వాటికి బానిసలుగా మారుతున్నారు. వాటిని చూడనిదే రోజు గడవని స్థితికి చేరుకుంటున్నారు. మరి ఇలాంటి సెక్స్ వీడియోలు చూడటం వల్ల వారి మీద పడే చెడు ప్రభావం ఏమిటి? ఈ పోర్న్ అడిక్షన్ నుంచి ఎలా బయటపడాలి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రోజురోజుకు పెరుగుతున్న సంఖ్య..
మన దేశంలోనూ ఈ పోర్న్ వీడియోలు చూసే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. అయితే అతిగా ఈ పోర్న్ వీడియోలు చూడటం వల్ల అనేక మానసిక, ఆరోగ్య దుష్ప్రభావాలు ఏర్పడతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చాలా వరకు యువతకు పోర్న్ వీడియోలు చూడడం అలవాటుగా మారుతోంది. ఇంట్లో పెద్దలకు తెలియకుండా ఫోన్లలో ఆ వీడియోలు చూస్తున్నారు. అరచేతిలో ఫోన్ ఉండడం, ఇంటర్నెట్ కనెక్షన్ అందుబాటులో ఉండడంతో ఎప్పుడు పడితే అప్పుడు పోర్న్ వీడియోలు చూస్తున్నారు.
మానవ సంబంధాలు దెబ్బతినే అవకాశం
కొంతమంది పరిమిత సమయాన్ని మాత్రమే వీటికి కేటాయిస్తే- మరికొందరు రోజులో అధిక శాతం వీటినే చూస్తూ బానిసలుగా మారిపోతున్నారు. ఫలితంగా రకరకాలుగా ఇబ్బందుల పాలవుతున్నారు. ఈ వీడియోలో ఎక్కువగా చూస్తే పరివర్తన విషయంలో భారీ మార్పులు వస్తాయి., సాధారణంగా చూసే వారికి ఏం కాదు కానీ ఎవరైతే వీటికి బానిసలుగా మారుతారో వారి జీవితం నాశనమవుతుంది. వారి పరివర్తనలో మార్పు రావడమే కాకుండా మానవ సంబంధాలు కూడా దెబ్బతింటాయని నిపుణులు పేర్కొంటున్నారు.
జీవితం నాశనం అవుతుంది
కొంత మంది ఆ వీడియోలను ఎక్కువగా చూస్తూ వాటికి బానిసైపోతారు. కేవలం వాటిని చూస్తేనే వారికి థ్రిల్ కలుగుతుంది. చివరకు వాటిని చూస్తేనే నిద్ర పడుతుంది. అలా బానిసలై ఆ వీడియోలు చూసే వారి జీవితం నాశనం అవుతుంది. ఎందుకంటే వారికి ఇతర పనులపై ధ్యాస ఉండదు. కాబట్టి పనులు, ఉద్యోగం లాంటివి మానేస్తారు. అందుకే ఇలాంటి వారు జాగ్రత్తగా ఉండాలి. వైద్యులను సంప్రదించి వెంటనే ఈ ఊబిలోంచి బయటపడేందుకు కృషి చేయాలి. ఆ వీడియోలు చూసి ఆ నటుల్లాగే హావభావాలు ఇవ్వాలని పురుషులు అనుకుంటారు. తమ జీవిత భాగస్వామితో అలాగే చేయాలని కోరుకుంటారు.
దంపతుల మధ్య గొడవలు..
నిజజీవితంలో అలా కోరుకునే వారికి చాలా ఇబ్బందులు తలెత్తుతాయి. ఎందుకంటే ఆ వీడియోల్లో ఉన్నదంతా నటనే. ఆ నటీనటులు కావాలనే అలా హావభావాలను వీడియోలుగా చిత్రీకరిస్తుంటారు. వీడియోలు ఎక్కువగా చూసే వారు కూడా తమ భాగస్వామి అలాంటివి రాకపోయే సరిసరికి గొడవలు పెట్టుకోవడం ప్రారంభిస్తారు. ఫలితంగా దంపతుల మధ్య గొడవలు జరిగి, సంసార జీవితం దెబ్బతింటుంది. నిజాన్ని అంగీకరించి భార్యతో మంచిగా ప్రవర్తించాలి. పోర్న్ వీడియోలు చూడటం మానేసి, వాటి నుంచి దృష్టి మరల్చే పనులు చేసుకోవాలి.