ట్రెక్కింగ్‌కి వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్న డాక్టర్

Date:

సరదాగా స్నేహితులతో గడపడానికి ట్రెక్కింగ్ కి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ కు చెందిన తెలుగు డాక్టర్ ఆస్ట్రేలియాలో కన్ను మూసింది. తన స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్ వెళ్లిన డాక్టర్ ఉజ్వల.. ప్రమాదవశాత్తు కాలు జారి లోయలో పడి మరణించింది. మృతురాలు కృష్ణా జిల్లా గన్నవరంకు చెందిన ఉజ్వలగా గుర్తించారు. ఆస్ట్రేలియాలోని స్నేహితులు తల్లిదండ్రులకు సమాచారంతో ఉజ్వల స్వగ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. కూతురు మరణంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ఆస్ట్రేలియా గోల్డ్‌కోస్ట్‌లోని బాండ్ విశ్వవిద్యాలయంలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన ఉజ్వల.. ప్రస్తుతం రాయల్ బ్రిస్బేన్ ఉమెన్స్ ఆసుపత్రిలో డాక్టర్ గా విధులు నిర్వహిస్తోంది. ఈ రోజు మృతదేహం కృష్ణాజిల్లా స్వగ్రామానికి తరలించనున్నారు. అనంతరం ఉంగుటూరు మండలం ఎలుకపాడులో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Share post:

Popular

More like this
Related

షుగర్ సమస్య మహిళల కంటే పురుషుల్లోనే ఎక్కువ

షుగర్ సమస్యతో బాధ పడుతున్న మహిళలతో పోలిస్తే పురుషులు ఇతర అనారోగ్య...

ఐఐటీ చదివే విద్యార్థులకు స్కాలర్‌షిప్‌

ఐఐటీల్లో చదవాలని చాలా మంది విద్యార్థులు కలలుగంటారు. సీటు వచ్చిన వారికి...

అప్పు కట్టలేదని రైతు భార్యపిల్లలను తీసుకెళ్లిన మహిళ

వ్యవసాయం కోసం ఒక రైతు ఓ మహిళ వద్ద అప్పు చేశాడు....

మూడు సెకన్లలోనే కాటేసిన మృత్యువు

మనిషి మరణం ఎప్పుడు, ఏలా వస్తుందో తెలియదు. కన్నుమూసి తెరిచేలోపే మనిషి...